Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి... కోర్టుకు అవినాశ్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (08:33 IST)
వైకాపా నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలంటూ ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైకాపా నేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ తన పట్ల అరెస్టు వంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. 
 
వివేకా హత్య కేసులో మరోమారు విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఆరో తేదీన హైదరాబాద్ నగరంలోని తమ సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందువల్ల హాజరుకాలేనని బదులిచ్చారు. దీంతో 10వ తేదీన రావాలంటూ మరోమారు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం సీబీఐ విచారణకు హాజరుకావాల్సివుది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేసేలా సీబీఐని అదేశించాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా అవినాశ్ రెడ్డి తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments