Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలు పూర్తి : ఏపీ అధికారిక లాంఛనాలతో...

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:49 IST)
దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు శనివారం ముగిశాయి. అంతకుముందు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంగంలో ఉదయం అంతిమయాత్ర నిర్వహించారు. మస్తాన్‌బాబు మృతదేహానికి కేంద్రమంత్రి వెంకయ్య, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్‌, పి.నారాయణ, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి నివాళులర్పించారు. 
 
మస్తాన్‌బాబు అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఆయనను కడసారి చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో గాంధీజనసంగం జనసంద్రంగా మారింది. గాంధీజనసంగంలోని మల్లిమస్తాన్‌బాబు పొలంలోనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.
 
అంతకుముందు.. మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని చెన్నై నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామం గాంధీ జనసంగానికి శుక్రవారం రాత్రి చేర్చారు.చెన్నై ఎయిర్ పోర్టు నుంచి ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. మస్తాన్ బాబును విగతజీవుడిలా చూసేసరికి అక్కడివారి గుండెలు బరువెక్కాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మస్తాన్ బాబు చివరి చూపుల కోసం గ్రామవాసులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments