Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని.. అన్నంలో పురుగుల మందు కలిపి...?

మాతృత్వానికే మచ్చ తెచ్చింది ఆ తల్లి. తన రెండో పెళ్ళికి అడ్డొస్తున్నాడనే కారణంతో తన మూడేళఅల కుమారుడిని ఆ తల్లి కిరాతకం చంపేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (16:38 IST)
మాతృత్వానికే మచ్చ తెచ్చింది ఆ తల్లి. తన రెండో పెళ్ళికి అడ్డొస్తున్నాడనే కారణంతో తన మూడేళఅల కుమారుడిని ఆ తల్లి కిరాతకం చంపేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముళ్లపాడుకు చెందిన సుజాతకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త ఆరునెలల క్రితం మరణించడంతో.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే వ్యక్తితో రెండో పెళ్లికి సిద్ధమైంది. 
 
అయితే మూడేళ్ల కుమారుడు సుజాత రెండో పెళ్ళికి అడ్డంగా మారడంతో.. కన్నబిడ్డను చంపేయాలనుకుంది. అంతే అన్నంలో పురుగుల మందు కలిపి పసివాడిని బలితీసుకుంది. ఆపై ఏమీ తెలియనట్లుగా తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. 
 
అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో విషప్రయోగం జరిగినట్లు తేలింది. దీంతో బాలుడి తల్లి సుజాతను కస్టడీలోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో తన బిడ్డ రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే కుమారుడిని చంపేశానని అంగీకరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments