Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికి పెళ్లి చూపులు.. అడవిలో పెళ్లి కుమార్తె... ప్రయాణికులకు మార్నింగ్ 'స్టార్స్'

రాత్రికి పెళ్లి చూపులు... అడవిలో పెళ్లి కుమార్తె. ఇదీ ఓ యువతి ఎదుర్కొన్న కష్టం. ఈ కష్టం ఎవరి వల్ల వచ్చిందో తెలుసా.. ఓ ప్రైవేట్ బస్సు ఆపరేటర్. ఆ బస్సు ఆపరేటర్ పేరు మార్నింగ్ స్టార్. ఈ బస్సు ఎక్కిన పాపా

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (11:49 IST)
రాత్రికి పెళ్లి చూపులు... అడవిలో పెళ్లి కుమార్తె. ఇదీ ఓ యువతి ఎదుర్కొన్న కష్టం. ఈ కష్టం ఎవరి వల్ల వచ్చిందో తెలుసా.. ఓ ప్రైవేట్ బస్సు ఆపరేటర్. ఆ బస్సు ఆపరేటర్ పేరు మార్నింగ్ స్టార్. ఈ బస్సు ఎక్కిన పాపానికి ప్రయాణికులకు నిజంగానే చుక్కలు చూపించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో బస్సును ఆపేశారు.. దీంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శుక్రవారం రాత్రి బెంగళూరులో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ 'మార్నింగ్ స్టార్'కు చెందిన బస్సు, తెల్లవార్లూ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఆర్టీయే అధికారుల తనిఖీల భయంతో దాదాపు ఏడు గంటల పాటు బెంగళూరు చుట్టూ తిరిగి తెల్లారేసరికి హోస్పేట్ సమీపానికి బస్సు చేరుకుని నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలోనూ బస్సు అక్కడే ఉంది.
 
ఈ బస్సు నిర్వాహకుల తీరుపై ఓ యువతి మాట్లాడుతూ తనకు నేడు (శనివారం) పెళ్లి చూపులని, రాత్రి బస్సెక్కితే, ఇప్పటికీ హైదరాబాద్‌కు చేరకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వాపోయింది. ఇక ఇద్దరు చిన్న పిల్లలతో బస్సెక్కిన మరో మహిళ, తమను ట్రావెల్స్ సంస్థ మోసం చేసిందని, అనుమతులు లేని బస్సును నడుపుతూ, రాత్రంతా ప్రయాణించినా, 100 కిలోమీటర్ల దూరం కూడా తీసుకు రాలేదని, ఇక ఇప్పుడు బస్సు బయలుదేరినా హైదరాబాద్ చేరేసరికి ఏ అర్థరాత్రి అవుతుందోనని చెప్పింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments