దసరా పండగ దృష్ట్యా పలు ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి, నర్సాపూర్-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.
వాటితో పాటు విజయవాడ-హుబ్లీ, తిరుపతి-అమరావతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈప్రత్యేక రైళ్లు అన్నీ 20వ తేదీ నుంచి మొదలుకొని 30వరకు తిరగనున్నాయని ద.మ.రైల్వే వివరించింది.
వివరాలు ఇలా...
* కాకినాడ పోర్టు- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.7:10గం.కు
* లింగంపల్లి- కాకినాడ: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.8:30గం.కు
* తిరుపతి- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ ఉ.6:55గం.కు
* లింగంపల్లి- తిరుపతి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ సా.5:30గం.కు
* నర్సాపూర్- లింగంపల్లి: ఈనెల 23 నుంచి ప్రతిరోజూ సా.6:55గం.కు
* లింగంపల్లి- నర్సాపూర్: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.9:05గం.కు
* విజయవాడ- హుబ్లీ: ఈనెల 21 నుంచి ప్రతిరోజూ రా.7:45గం.కు
* తిరుపతి- అమరావతి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ మ.3:10గం.కు
* అమరావతి- తిరుపతి: ఈనెల22 నుంచి ప్రతిరోజూ ఉ.6:45గం.కు