Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడొద్దు... కాస్త సమయం కావాలి... బాబుతో మోహన్ బాబు..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దివంగత నేత నందమూరి తారకరామారావుని దేవుడితో సమానంగా కొలిచే శిష్యుడు. అంతేకాదు దర్శకరత్న దాసరి నారాయణరావును కూడా అదేస్థాయిలో పూజించే గొప్ప వ్యక్తి. తనను సినీ జీవితంలో ఎదిగేలా చేసింది వీరు కాబట్టే వారి పట్ల తన విధేయతను చాటుతుం

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (18:49 IST)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దివంగత నేత నందమూరి తారకరామారావుని దేవుడితో సమానంగా కొలిచే శిష్యుడు. అంతేకాదు దర్శకరత్న దాసరి నారాయణరావును కూడా అదేస్థాయిలో పూజించే గొప్ప వ్యక్తి. తనను సినీ జీవితంలో ఎదిగేలా చేసింది వీరు కాబట్టే వారి పట్ల తన విధేయతను చాటుతుంటారు. తెలుగుదేశం పార్టీలో ఎంపిగా పనిచేసి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు ఈమధ్య కాలంలో చంద్రబాబునాయుడు తరచూ కలుస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
గత కొన్నిరోజుల ముందు సంక్రాంతి వేడుకలకు వచ్చిన నారావారిపల్లిలోనే స్వయంగా చంద్రబాబును కలిశారు మోహన్ బాబు. తను పార్టీలో చేరతానన్న విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పటికే ఎంతోమందిని పార్టీలోకి తీసుకుంటున్న బాబు, మోహన్ బాబును కూడా రమ్మన్నారు.
 
ఒక తేదీని ఖరారు చేసుకున్న మోహన్ బాబు చివరకు ఆ తేదీ కాకుండా కొద్దిగా సమయం కావాలని బాబును కోరారట. అమరావతిలో ఉన్న చంద్రబాబుతో ఫోన్ ద్వారా మాట్లాడిన మోహన్ బాబు ఇప్పుడే పార్టీలోకి వద్దు కొద్దిగా సమయం ఇవ్వండని రిక్వెస్ట్ చేశారట. అయితే చంద్రబాబు మాత్రం ఎందుకు.. ఏమిటి అని అడగకుండా సరేనని సైలెంట్ అయిపోయారట. అయితే మోహన్ బాబు టిడిపిలో చేరిక మాత్రం దాదాపు ఖాయమని తెలుస్తున్నా కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments