Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి మరణం జీర్ణించుకోలేకపోతున్నా: భోరున విలపించిన మోహన్‌ బాబు

తనకు నటుడిగా జీవితానిచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు అన్నారు. కిమ్స్‌ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మాట్లాడిన

Webdunia
బుధవారం, 31 మే 2017 (03:31 IST)
తనకు నటుడిగా జీవితానిచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు అన్నారు. కిమ్స్‌ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మాట్లాడిన మోహన్‌బాబు ‘నాకు నటుడిగా గుర్తింపునిచ్చిన మహనీయుడు దాసరి. దాసరి ఆత్మకు శాంతి చేకూర్చాలని  సాక్షిగా కోరుకుంటున్నాను’ అని చెప్పారు. దాసరి నారాయణరావు మృతితో  తెలుగు చిత్ర పరిశ్రమలో మూలస్థంభాన్ని కోల్పోయామని నటుడు మోహన్‌ బాబు అన్నారు. 
 
దాసరి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ఎదుట భోరున విలపించారు.  దాసరి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని, నటనలో తనకు ఓనమాలు నేర్పిన గురువు అని చెప్పుకొచ్చారు. తనకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాని మోహన్‌ బాబు అన్నారు. తనకు నటుడుగా దాసరి జన్మినిచ్చారన్నారు. నటుడిగా తనకో జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments