Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాడంబరంగా గవర్నర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక: శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్, భారతి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:11 IST)
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవ వేడుక విజయవాడ రాజ్ భవన్ లో బుధవారం జరిగింది. కరోనా నేపధ్యంలో అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులు, ఆహ్వానితులను అంగీకరించలేదు. కేవలం రాజ్ భవన్ ఉన్నతాదికారులు మాత్రమే గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు గవర్నర్ దంపతులకు మెమోంటోను బహుకరించారు.
 
అలనాటి వివాహ వేడుక జ్ఞాపకాలను ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు గుర్తు చేసుకున్నారు. వివాహా వార్షికోత్సవ వేడుక నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి భారతి రెడ్డి దంపతులు బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా చరవాణిలో మాట్టాడిన ముఖ్యమంత్రి దంపతులు మరెన్నో వార్షికోత్సవ వేడుకలు ఆనందమయంగా జరపుకోవాలని అభిలషించారు. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments