Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి, చంద్రబాబు జైలుకు వెళ్ళాల్సిందే: టీఆర్ఎస్ విప్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (13:19 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. సన్ బర్న్ షో, మ్యూజిక్ ప్రోగామ్‌లకు తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన బావమరిదికి ఎలాంటి సంబంధం లేదని.. ఈ తప్పుడు ఆరోపణలను నిరూపించలేకపోతే.. రేవంత్ రెడ్డి ముక్కుకు నేలకు రాయాలని సవాల్ విసిరారు. రాజీనామా డ్రామాకు రేవంత్ రెడ్డి తెరదించాలని పల్లా రాజేశ్వరి రెడ్డి అన్నారు. 
 
రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన రాజీనామా లేఖను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇవ్వాలని సవాల్ విసిరారు. అలాగాకుండా అమరావతిలో ఉండే ఏపీ సీఎంకు రాజీనామా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. నెల రోజులు జైలులో ఉన్న రేవంత్ రెడ్డి నేర స్వభావంతో మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఊసరవెల్లిలా అనేక పార్టీలు మారారని విమర్శించారు.  
 
హైద‌రాబాద్‌లో స‌న్ బ‌ర్న్ పేరుతో పార్టీ నిర్వ‌హించేందుకు ఓ ప‌బ్‌కి అనుమతులు ఇచ్చారన్న రేవంత్ ఆరోపణలను పల్లా ఖండించారు. కొత్త పబ్బులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లు మూతపడ్డాయని గుర్తుచేశారు.
 
హైదరాబాద్ నగరం డ్రగ్స్ జోన్‌లో లేదని నార్కోటిక్స్ విభాగం స్పష్టం చేసిన విషయాన్ని కూడా పల్లా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారిందని వెల్లడించారు. ఒకప్పుడు చంద్రబాబు వేసిన బొక్కలు తిని రేవంత్ కుక్కలా పనిచేశాడని ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments