Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు: నారా భువనేశ్వరి మాటలు నిజమే

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (14:20 IST)
వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్ళే పోతారన్న నారా భువనేశ్వరి మాటలు నిజమేనని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆడవాళ్లను ఏడిపంచారని.. అందులో తాను కూడా ఉన్నానన్నారు. 
 
అంతాలా ఆడవాళ్లను ఏడిపించారు కాబట్టి చంద్రబాబుకి పాపం తగిలిందని గుర్తు చేశారు. సీఎంగా వున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆడవాళ్లను ఏడిపిస్తుంటే.. అప్పుడు మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు చంద్రబాబు దొంగ ఏడుపులకు స్పందించడం ఏంటని రోజా ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని మీరు గుర్తించాలన్నారు. 
 
సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందని రోజా అన్నారు. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడారా అని రోజా నిలదీశారు. ఒక మహిళగా.. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరిపై తనకు అభిమానం ఉందన్నారు. అయితే నిజంగా ఏడు పాపం తగిలేది ఉంటే ముందుగా చంద్రబాబుకే తగిలేది అన్నారు.  
 
ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన.. ఇన్ని సందర్బాల్లో మహిళ బాఢిన విషయం నారా భువనేశ్వరికి తెలియదా అని ప్రశ్నించారు. ఆ రోజు కనిపించని భువనేశ్వరి.. ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు. 
 
మీ భర్త దొంగ ఏడ్పులు ఏడిస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యను కూడా రోడ్డున పెడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనించారని రోజా ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments