Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు అమ్మే రైతులు కోటీశ్వరులు కావడం లేదు ఎందుకని : ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2015 (13:56 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు పాలు అమ్ముకుని జీవిస్తున్నారని, వారంతా కోటీశ్వరులు కావడం ఎందుకని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. కానీ, రైతుల వద్ద నుంచి పాలు సేకరించి.. హెరిటేజ్ పేరుతో పాల వ్యాపారం చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కోటీశ్వరుడు అయ్యారని, ఇందులోని కిటుకేంటో రైతులకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. ఇటీవల కుటుంబ ఆస్తులు ప్రకటించిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని, జీవితం ఇలానే చాలా బాగుందని అన్నారని గుర్తు చేశారు. పాలు, కూరగాయలతో కోట్లు సంపాదించే కిటుకేంటో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి హెరిటేజ్‌కు పాలు అమ్మిన రైతులెందుకు కోటీశ్వరులు కావడంలేదని సూటిగా ప్రశ్నించారు. 
 
నారాయణ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఇంతవరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయరని సూటిగా ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన యాజమాన్యాలపై కేసు పెడతామని మంత్రి గంటా చెప్పారని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments