Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ ... శవ రాజకీయం చేయటం తగదు...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (15:28 IST)
ప్ర‌తిదీ వివాదాస్ప‌దం చేయ‌డం, శ‌వ రాజ‌కీయాలు చేయ‌డం తెలుగుదేశం పార్టీకి అల‌వాటు అని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా విమ‌ర్శించారు. లోకేష్.. శ‌వ రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు.

గుంటూరు కాకాని రోడ్ పరమాయ కుంట వద్ద ఆదివారం బీటెక్ విద్యార్థిని ర‌మ్య హత్య సంఘ‌ట‌న ఇపుడు రాజ‌కీయ వివాదంగా మ‌రింది. ర‌మ్య మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు టీడీపీ నాయకులు వ‌చ్చారు. అక్క‌డికి లోకేష్ రాక ముందే శ‌వాన్ని పోస్ట్ మార్టం చేసి పంపుతుండ‌గా, తెలుగుదేశం నాయ‌కులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు.

ఇలా లోకేష్ వ‌చ్చి శవ రాజకీయాలు చేయటం తగదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు. స్టూడెంట్ హత్య జరిగితే, అదేదో రాజకీయ హత్య మాదిరిగా పెద్ద ఎత్తున టిడిపి నాయకులు వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య చేసిన నిందితున్ని పెట్టుకున్నారని, తగిన శిక్ష పడుతుందని తెలిపారు. అయితే, ఇంత నిర్బంధం మ‌ధ్య రమ్య భౌతిక కాయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించి, ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ స‌మ‌యంలో నారా లోకేష్ కి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణ త‌లెత్త‌గా, కొంద‌రు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ద‌శ‌లో ఇద్ద‌రు జిల్లా ఎస్పీలు వచ్చిన గొడవ సర్దుమనగపోవడంతో నారా లోకేష్ ని అక్కడి నుండి ప్ర‌త్తిపాడు పోలీస్ స్టేష‌న్ కి పోలీసులు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments