Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణంలో యువతిపై ప్రైవేట్ కారు డ్రైవర్ అత్యాచారం

విశాఖపట్టణంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ 17 ఏళ్ల అమ్మాయిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (12:02 IST)
విశాఖపట్టణంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ 17 ఏళ్ల అమ్మాయిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 30 ఏళ్ల డ్రైవర్ కోసం పోలీసులు గాలించి నిందితుడిని పి.శ్రీనివాస్‌గా గుర్తించారు. అతను హెచ్‌బి కాలనీలో నివసిస్తూ సుబ్బలక్ష్మినగర్‌లోని ఓ ఇంటిలో కారు డ్రైవరుగా పనిచేస్తున్నట్టు తేలింది. బాధితురాలు ఇదే ఇంట్లో పనిమనిషిగా పని చేస్తూ వచ్చింది. 
 
ఈ యువతిని గురువారం సాయంత్రం తాము పనిచేస్తున్న ఇంటి సమీపంలోని ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. 
 
బాధితురాలిని పరీక్షల నిమిత్తం కింగ్ జార్జి ఆస్పత్రికి పంపించారు. అమ్మాయి మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా, ఆమెకు 21 ఏళ్లు ఉంటాయని ఆమె యజమానులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments