Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు చీటర్ అయితే, జగన్ లీడర్.. రోజా సెటైర్లు

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (19:41 IST)
మహిళా సాధికారతపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆడపిల్లల కష్టాలు జగన్‌కు తెలుసునన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారని కొనియాడారు. 
 
మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలిపిన జగన్‌కు రోజా అసెంబ్లీ సాక్షిగా సెల్యూట్ చేశారు. మద్దతు తెలిపిన మిగతా సభ్యులకు నమస్కారం పెడుతూ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాము 14 మంది మహిళా ఎమ్మెల్యేలం ఉన్నామని, మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చాక 58కి చేరుకుంటామన్నారు.  
 
టీడీపీ అధినేత చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని, ఆయనది బోగస్ ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చీటర్ అయితే, జగన్ లీడర్ అంటూ తెలిపారు. అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో దాక్కున్న లోకేశ్‌కు, జైలులో ఉన్న చంద్రబాబుకు, అసెంబ్లీలో తొడగొట్టిన బాలకృష్ణకు ఒకటే చెబుతున్నానని, జగన్ ఈ నాలుగేళ్లలో అమలు చేసిన పథకాలు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments