Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాసర సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:29 IST)
శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. కుటుంబ సమేతంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ద‌ర్శ‌నానంత‌రం వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.  
 
నవరాత్రి ఉత్సవాలు మంగళవారం 6వ రోజు మూల నక్షత్రం కావడంతో ఆలయాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు అమ్మవారు 6వ రోజు కాత్యాయిని దేవి రూపంలో దర్శనమిచ్చారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాసర క్షేత్రాన్ని  ద‌శ‌ల‌వారీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 8 కోట్లతో ఆలయ అతిథి గృహాల నిర్మించామన్నారు. మ‌రో 42 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఆలయ విస్తరణ పనులలో బాగంగా క్యూ కాంప్లెక్స్ గోదావరి న‌ది స‌మీపాన వాష్ రూం ల‌తో పాటు  టిటిడి అతిథి గృహాన్ని  పనులు చేస్తామని అన్నారు. బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం చేసుకున్నవారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని... భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు క‌ల‌గ‌కుండా  సౌక‌ర్య‌లను మ‌రింత మెరుగుప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. మంత్రి వెంట జడ్పి చైర్ పర్సన్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments