Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ ... పెయిడ్ పొలిటికల్ ఆర్టిస్ట్ : పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (16:19 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‍పై ఏపీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆరోపించారు. అంతేకాకుండా, పవన్ ఓ పెయిడ్ పొలిటికల్ ఆర్టిస్ట్ అని చెప్పారు. 
 
ఆయన ఆదివారం తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ప్రసంగిస్తూ, నిన్నమొన్నటిదాకా బీజేపీని తిట్టిపోసిన పవన్ కల్యాణ్... పాచిపోయిన లడ్డూలనే ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటున్నాడన్నారు. 
 
తిరుపతిలో బీజేపీ-జనసేన-టీడీపీ లాలూచీ పడ్డాయని, ఓ ఒప్పందం ప్రకారం నడుచుకుంటున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి తిరుపతిలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
 
అంతేకాకుండా, టీడీపీ అధినేత చంద్రబాబు రెఫరెండం సవాల్‌ను స్వీకరిస్తున్న‌ట్లు చెప్పారు. ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి ఓడిపోతే త‌మ‌ 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని ఆయ‌న అన్నారు.
 
ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి ఓడిపోతే టీడీపీకి చెందిన‌ ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయించాల‌ని స‌వాలు విసిరారు. 
 
కాగా, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చార‌ స‌భ ర‌ద్ద‌యిన విష‌యంపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. క‌రోనా వ్యాప్తి కారణంగానే ఆ సభను రద్దు చేసిన‌ట్లు చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.
 
ఇక, తిరుపతిలో సీఎం జగన్ సభ రద్దుకు కరోనా వ్యాప్తే కారణమని స్పష్టం చేశారు. రోజుకు 3 వేల కేసులు వస్తుంటే బాధ్యతగల సీఎంగా జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతోనే సభ రద్దు చేసుకున్నారు తప్ప మరో  లేదని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments