Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు : జేసీ దివాకర్

పిల్లలు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తో ఇలా రోడ్డు ప్రమాదాల్లో అర్థాంతరంగా చనిపోతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు జీర్ణించుకోలేమన్నారు. పైగా, ధనవంతుల పి

Webdunia
బుధవారం, 10 మే 2017 (15:40 IST)
పిల్లలు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తో ఇలా రోడ్డు ప్రమాదాల్లో అర్థాంతరంగా చనిపోతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు జీర్ణించుకోలేమన్నారు. పైగా, ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిపోతుందన్నారు. 
 
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మలు బుధవారం వేకువజామున హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిందని అన్నారు. ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని ఆయన ఆక్షేపించారు. 
 
రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువకులు తమ వంశాన్ని ఉద్దరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త జీర్ణించుకోవడం కష్టమన్నారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు.
 
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి... మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియగానే ఆసుపత్రికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదన్నారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబ సభ్యలను ఆయన ఓదార్చారు. ఎంతో భవిష్యత్ చూడాల్సిన పిల్లాడ్ని ఇలా చూడాల్సి రావడం బాధాకరమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments