Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం : యశోద వైద్యులు

Webdunia
శనివారం, 26 జులై 2014 (15:18 IST)
మెదక్ రైలు ప్రమాదంలో గాయపడిన నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మెదక్ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో 9 మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా, నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన వైద్యులు వరుణ్, ప్రశాంత్, వైష్ణవి, తరుణ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, శరత్, శ్రావణి, శిరీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
 
అభినంద్, శివకుమార్, సందీప్, నితూష వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మిగిలిన తొమ్మిది మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వారిని సాయంత్రం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించనున్నట్లు వారు తెలియజేశారు. సాయిరాం, రుచిత, సాత్విక, హరీష్, మహిపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్, దర్శన్, కరుణాకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వివరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments