Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక శీలాన్ని అనుభవించాడు.. గర్భానికి రూ.లక్ష వెలకట్టాడు!

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (11:40 IST)
మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. 17 బాలికను 16 యేళ్ల వయస్సున్న బాలుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఇది బయటకు పొక్కడంతో పంచాయతీ పెట్టి.. గర్భానికి లక్ష రూపాయలు వెలకట్టాడు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా పడి బహిర్గతం కావడంతో పోలీసులు స్పందించి, బాలికపై అత్యాచారం చేసిన బాలుడితో పాటు.. గర్భానికి వెల కట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే మెదక్ జాల్లా గజ్వేల్ మండలంలోని మక్తమాసాన్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల శివాజీ (16) కుటుంబీకులకు చెందిన పొలంలోకి అదే గ్రామానికి చెందిన బాలిక (17) చిక్కుకుడు కాయల కోతకు వెళ్లింది. ఆ సమయంలో ఆ బాలికపై కన్నేసిన శివాజీ.. తన మాయమాటలతో ఆ బాలికను లోబర్చుకుని ఆ తోటలోనే అనుభవించాడు. 
 
ఆ తర్వాత నెల తిరిగే సమయానికి బాలికను గర్భవతి అయింది. ఈ విషయం బాలిక శివాజీతో చెప్పడంతో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు లక్ష రూపాయలు ఇస్తాం.. గర్భం తీసేయించుకోమని సలహా ఇచ్చాడు. దీనికి ఆ బాలిక ససేమిరా అంది. 
 
ఆ తర్వాత బాలిక ఫిబ్రవరి 23న పంచాయతీ పెట్టించింది. 24న బాలిక శీలానికి లక్ష రూపాయలు ఖరీదు కట్టి అబార్షన్ చేయించుకోవాలని తీర్పునిచ్చారు. పిమ్మట శివాజీ సోదరుడు రాజు, బావ మేస్త్రీ శ్రీను, సోదరి రాణెమ్మలు గజ్వేల్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. 
 
అయితే, ఈ విషయం వెలుగు చూడటంతో తోగుంట పోలీసులు రంగంలోకి దిగి.. శివాజీ, రాజు, శ్రీను, రాణెమ్మ, డాక్టర్ సాంబశివరావులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?