Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్ళిళ్లు-డాబాలే వేదికలయ్యాయి..

తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు మించిన వివాహాలు జరిగాయి. మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడం

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (14:09 IST)
తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు మించిన వివాహాలు జరిగాయి. మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో భారీ సంఖ్యలో వివాహాలు జరిగాయి. పెళ్ళి మంటపాలు, ఆలయాలు నిండిపోయాయి. మంటపాలు దొరకకుండా ముహూర్తాల కోసం ఇళ్ళల్లోనే చాలామంది వివాహాలు జరిపించారు. 
 
ఈ పెళ్లిళ్ళ కోసం సుమారు రూ.20వేల కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సగటున రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మూడు చొప్పున వివాహ ఆహ్వాన పత్రికలు అంది ఉంటాయని అంచనా. నగరాల్లోని కళ్యాణ్ మండపాలన్నీ షిఫ్ట్‌ల వారీగా అద్దెలకు ఇచ్చారు. మంటపాలు దొరకని వారు అపార్ట్‌మెంట్ సెల్లార్లలో వేదికలు నిర్మించుకుని పెళ్లి తంతును ముగించేశారు. వాహన రాకపోకలతో రద్దీ, ట్రాఫిక్ తప్పలేదు. 
 
అయితే మంటపాల కోసం, ఫోటోగ్రఫీ వంటి ఇతర సేవలకు జీఎస్టీ విధించడంతో ముహూర్తాలు కూడా లేకపోవడంతో అనేకమంది తల్లిదండ్రులు ఇళ్ళపై డాబాల్లో వేదికలు నిర్మించి వివాహాలు జరిపించేశారు. ఇంటి డాబాలను వివాహ వేదికలుగా మార్చడం ద్వారా జీఎస్టీతో కేటరింగ్, ఫోటోగ్రఫీ వంటి ఇతరత్రా ఖర్చుల్లో కొంతమేరకు తగ్గాయని వధూవరుల తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments