Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల అంత పాపం చేసి పుడుతోందా: మనీషా ఆవేదన

స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం చెందుతున్నాయో అర్థం కావడం లేదని బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ జాతీయ సమావేశాల్లో అతిథిగా పాల్గొన్న మనీషా

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (03:11 IST)
స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం చెందుతున్నాయో అర్థం కావడం లేదని బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ జాతీయ సమావేశాల్లో అతిథిగా పాల్గొన్న మనీషా తన జన్మ విషయంలో కూడా తమ తాత అలాగే బాధపడ్డారని తెలిపి విచారం వ్యక్తం చేశారు. 
 
‘నేను పుట్టినప్పుడు మా తాత ఎంతో బాధపడ్డారట. ఆడపిల్ల పుట్టిందే అని ఆయన ముఖం చిన్నబోయిందట. నేను పెద్ద అయిన తరువాత నాకు ఆ విషయం తెలిసి ఎంతో ఆవేదన చెందా. ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఆ ఆవేదన తీరలేదు. ఇలాంటివాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత యువతులదే’ అన్నారు.
 
భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై మనీషా కొయిరాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 48 శాతంగా ఉంటే పార్లమెంటులో మాత్రం మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 11 శాతంగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments