Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మెసేజ్‌లను ట్రాక్ చేయడానికి యాప్.. లాడ్జికి రమ్మని చంపేశాడు..

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (12:38 IST)
ప్రేమించి పెళ్లిచేసుకున్నారు, పెళ్లైన నాలుగు రోజులకే భర్త దుబాయి వెళ్లాడు. కానీ కొద్ది రోజులకే తిరిగి వచ్చాడు. ఇంటి తలుపు తట్టడంతో భార్య ఆలస్యంగా తలుపు తీసింది. ఆనుమానం పెంచుకున్నాడు. అది భార్య హత్యకు దారితీసింది. అంతే కాకుండా తానే హత్య చేసానని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వివరాల్లోకి వెళితే గద్వాల్‌కు చెందిన రఫీ(34) సికింద్రాబాద్‌ లాలాగూడలోని రైల్వే క్వార్టర్‌కు చెందిన నఫీజ్‌ బేగం(24) ప్రేమించుకున్నారు.
 
వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత రఫీ దుబాయ్ బయలుదేరాడు. జనవరి మొదటి వారంలో భార్యకు చెప్పకుండా లాలాగూడలోని ఇంటికి వచ్చాడు. తలుపు తట్టాడు. భార్య ఆలస్యంగా తలుపు తీయడంతో అప్పటి నుండి అనుమానం పెంచుకున్నాడు. నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నాడు, భార్య మెసేజ్‌లను ట్రాక్ చేయడానికి ఒక యాప్‌ని ఉపయోగించాడు. 
 
వారం రోజుల తర్వాత మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు. భార్య పంపే సందేశాలను అక్కడ ఆ యాప్ ద్వారా ట్రాక్ చేసేవాడు. కానీ ఈ నెల 12వ తేదీ సాయంత్రం మళ్లీ భార్యకు చెప్పకుండా లాలాగుడకు వచ్చాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఎందుకో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. రఫీ అక్కడ నుండి వెళ్లి సికింద్రాబాద్‌ గురుద్వార సమీపంలో గల లోటస్‌ గ్రాండ్‌ లాడ్జిలో రూమ్ నంబర్ 502 బుక్ చేసుకున్నాడు. రాత్రి అతనికి భార్య ఫోన్ చేసింది. మాట్లాడాలని, కలవాలని చెప్పింది. లాడ్జీకి రమ్మని చెప్పాడు. 
 
ఆ రాత్రే ఆమె భార్తను కలిసేందుకు లాడ్జీకి వెళ్లింది. లోటస్‌ గ్రాండ్‌ లాడ్జిలో భార్యను చంపేశానంటూ గోపాలపురం పోలీసులు, కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న రఫీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నఫీజ్‌ బేగం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించారు. 
 
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బుధవారం 11 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రఫీ ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చి తిరిగి వెళ్లిపోవటానికి కారణం ఏమిటి, ఆమెను ఎందుకు చంపవలసి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం ఉందని అనుమానించి ఈ పని చేసాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఏ యాప్ ఉపయోగించాడో చెప్పడంలేదని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments