Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టా చెమ్మా.. పేకాటలతో కరోనా వ్యాప్తి.. 17మంది పాజిటివ్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లల్లోనే వుండిపొమ్మంటే.. జనాలు గుంపుగా అష్టా చెమ్మా, పేకాట, క్యారంబోర్డులు ఆడుతూ గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా సులభంగా వ్యాపిస్తోంది. ఇటీవల సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచెమ్మ ఆడి 31 మందికి కరోనాను అంటించింది. తాజాగా విజయవాడలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి మరికొంత మందికి అంటించాడు.
 
కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్య వీధిలో ఓ లారీ డ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. అతడు ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. వచ్చిన వెంటనే తన స్నేహితులతో కలిసి పేకాట ఆడాడు. అనంతరం అతడు తీవ్ర జ్వరంతో బాధపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడితో పేకాడిన వారికీ పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. 
 
దీంతో కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిని పూర్తిగా మూసేశారు అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరికొందరిని కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లోనే ఉండాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments