Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి పెద్దలు అడ్డు.. కలిసి చనిపోదామంటే నో చెప్పింది.. చివరికి ఆ ప్రియుడు ఏం చేశాడంటే?

ప్రేయసి వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. మతాలు వేరు కావడంతో ప్రేయసి తల్లి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలిన తీవ్ర కొట్టిన ప్రియుడు.. ఆమెను

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (11:10 IST)
ప్రేయసి వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. మతాలు వేరు కావడంతో ప్రేయసి తల్లి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలిన తీవ్ర కొట్టిన ప్రియుడు.. ఆమెను హత్యచేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మధు (25) హైదరాబాద్‌లో పని చేస్తుంటాడు. ఇతడు స్వగ్రామంలోని ముస్కాన్‌ పేటకు చెందిన సుస్మిత (22)ను ఐదేళ్లుగా ప్రేమించాడు. సుస్మిత కూడా మధును ప్రేమించింది. కానీ ఇద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. 
 
గురువారం నాడు సిద్ధిపేటలో ఓ వివాహం కోసం వచ్చిన మధు సుస్మితకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె వచ్చింది. అప్పటికే తన వెంట కూల్ డ్రింక్, పురుగుల మందును తెచ్చిన మధు, చనిపోయి ఒకటవుదామని తెలిపాడు. కానీ సుస్మిత ఎంతమాత్రం అంగీకరించకపోవడంతో మధు ఉన్మాదిగా మారిపోయాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. 
 
స్పృహ కోల్పోయిన ఆమె మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఆపై అక్కడే తాను కూడా ఉరేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తాను చేసిన పనిని తన స్నేహితుడికి తెలిపాడు. ఈ విషయం తెలుసుకుని స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చే లోపే మధు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments