Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారానికి నిరాకరించిందనీ ప్రియురాలి కుమారుడిని చంపేశాడు...

ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ప్రియురాలు నిరాకరించడంతో ఆమె కుమారుడిని దారుణంగా హత్యచేశాడు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌, నెసపక్కాంలో ఈ దారుణం జరుగగా, తాజా

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (12:54 IST)
ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ప్రియురాలు నిరాకరించడంతో ఆమె కుమారుడిని దారుణంగా హత్యచేశాడు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌, నెసపక్కాంలో ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నెసపాక్కం ప్రాంతానికి చెందిన కార్తికేయన్‌ (37), మంజుల (36) దంపతులకు నితీష్‌సాయి అనే పదేళ్ల కుమారుడు ఉన్నాడు. మంజులకు కార్తికేయన్‌ రెండోభర్త. మొదటి భర్త మరణించడంతో అతని ప్రభుత్వ ఉద్యోగం మంజులకు వచ్చింది. అయితే, మంజులకు అదేప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేస్తున్న నాగరాజ్‌తో వివాహేతర సంబంధం ఉంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక అతన్ని దూరంగా పెట్టసాగింది. దీంతో మంజులపై కక్ష పెంచుకున్న నాగరాజ్... ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు.
 
గురువారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన నితీష్‌ సాయి రాత్రి 9.30 గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కార్తికేయన్‌ ట్యూషన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లాడు. కుటుంబ స్నేహితుడైన నాగరాజ్‌ (27) బాలుడిని తీసుకెళ్లినట్లు టీచర్‌ తెలిపింది. ఎంతవెతికినా బాలుడు కనిపించకపోవడంతో కార్తికేయన్‌ ఎంజీఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై నాగరాజ్‌ను పోలీసులు పిలిచి మందలించి వదిలివేశారు. 
 
అయితే, మంజుల ఆ తర్వాత కూడా నాగరాజ్‌తో సంబంధాన్ని కొనసాగించింది. కానీ, కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మంజుల నాగరాజ్‌కు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని నాగరాజ్‌ ప్రియురాలితో గొడవపడుతూ వచ్చాడు. ఎంతకూ మాట వినకపోవడంతో ఉన్మాదిలా మారిన నాగరాజ్‌ ఆమె బిడ్డను హతమార్చాడు. ఈ కేసులో నాగరాజ్‌తో పాటు.. మంజులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments