Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టాడు.. చివరికి..?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (11:48 IST)
విశాఖలో మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్‌గా.. వెబ్‌సైట్‌లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజీరియన్లు. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్లు చెప్తూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు. 
 
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారులు అంటూ ఇంకొకరితో ఫోన్ చేయించడం.. టాక్స్ కడితే విడిచి పెట్టేస్తానంటూ లక్షలు గుంజేస్తున్న వైనం బయటపడింది. విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురవాడకు చెందిన ఒక ముస్లిం యువతికి కొన్నాళ్ల కిందట వివాహమైంది. 
 
రెండేళ్ల పాప వుంది. భర్తతో విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించింది. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్ ఒక మ్యాట్రీమోనీ డాట్‌కామ్‌లో అప్‌లోడ్ చేశారు. సంబంధిత వెబ్ సైట్ ఆమె వివరాలను చూసిన కేటుగాళ్లు.. నెలరోజుల కిందట ఆమెకు ఫోన్ చేశారు. 
 
దుబాయ్‌లో వుంటానని నమ్మబలికాడు. గిఫ్టులు కస్టమ్స్ అంటూ డబ్బులు పంపమని.. మోసం చేశాడు. సదరు మహిళ డబ్బు పంపాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments