Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇద్దరికీ 'ఆ' సంబంధం ఉంది.. వేర్వేరుగా బతకలేకపోతున్నాం.. కలిసి చనిపోతున్నాం...

మా ఇద్దరికీ అక్రమం సంబంధం ఉంది. కట్టుకున్న భర్త కంటే.. నేను మనసు పడిన వ్యక్తి వద్దే హాయిగా సుఖం పొందుతున్నాను. అయినా మేమిద్దరం కలిసి బతికేందుకు ఈ సమాజం అంగీకరించదు.

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (10:01 IST)
మా ఇద్దరికీ అక్రమం సంబంధం ఉంది. కట్టుకున్న భర్త కంటే.. నేను మనసు పడిన వ్యక్తి వద్దే హాయిగా సుఖం పొందుతున్నాను. అయినా మేమిద్దరం కలిసి బతికేందుకు ఈ సమాజం అంగీకరించదు. అందుకే ఇద్దరం కలిసి చనిపోతున్నాం అంటూ ఓ వివాహిత, ఓ వివాహితుడు కలిసి సూసైడ్ లేఖ రాసి పెట్టి కనిపించకుండా పోయారు. గుంటూరు జిల్లా సంగడిగుంట ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గంటూరు జిల్లా స్వర్ణ భారతినగర్‌కు చెందిన ఓ మహిళకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే, ఇదే జిల్లా నగరాలుకు చెందిన ఆటో డ్రైవర్‌ గోపికి ఏడేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈ మహిళకు గోపితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
కుటుంబ సభ్యులకు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి హెచ్చరించారు. దీంతో ఇద్దరూ వెళ్లిపోవాలని నిర్ణయించుకొని శనివారం రాత్రి వారి తల్లులను ఉద్దేశించి ఇలా ఉత్తరాలు రాశారు. తాము కలసి బతకాలనుకున్నామనీ, కానీ ఆ పరిస్థితులు లేవనీ పేర్కొన్నారు. అందుకే చనిపోతున్నామనీ, తమ మృతదేహాల కోసం కూడా గాలించవద్దనీ రాశారు. దీనిపై నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments