Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడికి యత్నం?

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై కార్మికులు, రోజువారీ కూలీల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి కారణం, వారికి ఉపాధి లేకపోవడమే. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇసుక కంటికి కనిపించకుండా పోయింది. దీంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. అనేక మంది భార్యాపిల్లలను పోషించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా మచిలీపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. పేర్ని నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. పేర్నినాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. 
 
దీంతో అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments