Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లపై అసభ్యకరంగా వీడియోలు పెడితే...మంచు విష్ణు హెచ్చరిక!

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (11:02 IST)
హీరోయిన్లపై అసభ్యకరంగా వీడియోలు పెడితే ఊరుకునేది లేద‌ని యూట్యూబ్‌ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక జారీ చేశారు. మా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన విష్ణు త‌న‌దైన శైలిలో ఇక్క‌డ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. తొలి అడుగులోనే ఆయ‌న మీడియా, యూట్యూబ్ ఛానళ్ల అస‌భ్య థంబ్ నైల్స్ పై ప‌డ్డారు. 
 
హీరోయిన్లపై అసభ్యకరమైన వీడియోలు, థంబ్‌నైల్స్‌ పెడితే క్షమించేది లేదని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటీనటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నారు. అలా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తీసుకుంటాం. వాటిలో థంబ్‌నైల్స్‌ హద్దులు దాటుతున్నాయి.  నటీమణులు మన ఆడపడుచులు. వారిని గౌరవించాలి’’ అని విష్ణు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్లపై అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేస్తే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
హద్దులు మీరే ఇలాంటి యూట్యూబ్‌ ఛానళ్లును నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని విష్ణు పేర్కొన్నారు. ఇటీవ‌ల యూట్యూబ్ ఛాన‌ళ్ళు వెబ్ పోస్టింగులు పెట్టేడ‌పుడు, పైన థంబ్ నెయిల్ ఒక‌టి, లోప‌ల కంటెంట్ ఒక‌టి పెడుతున్నార‌ని ఇది మ‌రీ దారుణం అని మా అధ్య‌క్షుడు మంచు విష్ణు భావిస్తున్నారు. దీనిపై నిరంత‌రం నిఘా పెట్టేందుకు ఒక ప్ర‌త్యేక‌మైన లీగ‌ల్ సెల్ ని మా కార్యాల‌యంలో ఏర్ప‌టు చేయాల‌ని సంక‌ల్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments