Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన!!

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (08:45 IST)
ఒరిస్సా తీరాన్ని ఆనుకుని వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడివుంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు, ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, ఈ కారణంగా మంగళవారం కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
 
ముఖ్యంగా, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం మన్యం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వివరించింది. అలాగే, ఈ నెల 19వ తేదీ నాటికి వాయువ్య, పశ్చి మధ్య బంగాళాఖాతంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
వెస్ట్ బెంగాల్ ఆర్థిక మాజీ మంత్రి కరోనా పాజిటివ్!
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒకటి వెలుగు చూసింది. ఆ రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి అమిత్ మిత్రాకు ఈ వైరస్ సోకింది. సోమవారం ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఐసోలేటెడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
దీనిపై బెంగాల్ ప్రభుత్వ వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, కరోనా కారణంగా మాజీ మంత్రి మిత్ర సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. 
 
కాగా, గత 2019 డిసెంబరులో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ అనేక ప్రపంచ దేశాల్లో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. మన దేశంలో కూడా విలయతాండవం చేసింది. దీంతో లాక్డౌన్‌ను అమలు చేశారు. ఈ వైరస్ 2020లో సద్దుమణిగినప్పటికీ ఆ తర్వాత రెండు, మూడు దశలుగా వ్యాపించి, గత యేడాది కాలంగా శాంతించింది. ఇపుడు మళ్ళీ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments