Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో ఓడిపోయాం.. పురుగుల మందు తాగి చనిపోతున్నాం.. కృష్ణగిరిగుట్టపై?

ప్రేమికుల దినోత్సవానికి ముందు రోజు ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తాము ప్రేమలో ఓడిపోయామంటూ ఆ జంట మనస్తాపానికి గురైంది. దీంతో పురుగుల మందు తాగి ఆ జంట ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:00 IST)
ప్రేమికుల దినోత్సవానికి ముందు రోజు ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తాము ప్రేమలో ఓడిపోయామంటూ ఆ జంట మనస్తాపానికి గురైంది. దీంతో పురుగుల మందు తాగి ఆ జంట ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాల సమీపాన సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన మధు(22), ఓ యువతి (16) ప్రేమికులు. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపహరణ కేసు కింద మధును రిమాండుకు తరలించారు.
 
మధు రిమాండ్‌కు వెళ్లగానే.. అదే గ్రామానికి చెందిన మల్లేష్ (వరుసకు బావ)తో యువతికి పెళ్లిచేసి, పిట్టలగూడలోనే కాపురం పెట్టారు. శనివారం రాత్రి ఇంట్లో భోజనంచేసి నిద్రించిన యువతి... ఆదివారం తెల్లారేసరికి కనిపించలేదు. దీంతో మధుపై అనుమానం వ్యక్తంచేస్తూ యువతి కుటుంబ సభ్యులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరిద్దరి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం దుద్యాల సమీపంలోని కృష్ణగిరిగుట్టపై కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తాము పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫోనులో మధు చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments