Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితతో ప్రేమ.. రైలు ముందు నిల్చుని ప్రేమికుల ఆత్మహత్య..

వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (12:00 IST)
వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామానికి చెందిన మండవ వినయ్ అనే యువకుడు గుంటూరు జిల్లాలోని వినుకొండలో స్టీల్ సామాన్లు విక్రయించేవాడు. వినుకొండలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉండేవాడు.
 
ఈ క్రమంలోనే వినుకొండకు చెందిన ఎస్కే జీనత్‌తో పరిచయం ఏర్పడింది. జీనత్‌కు చిన్నతనంలోనే సైదుల్లా అనే వ్యక్తితో పెళ్లాడింది. ఆమెకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు. అయినా వినయ్‌కు జీనత్‌ల మధ్య ప్రేమ చిగురించింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
రెండు రోజుల క్రితం వారిద్దరూ వినుకొండను వదిలేసి నెల్లూరుకు వచ్చారు. అయితే శనివారం నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు. ఇద్దరూ రైలు ముందు నిల్చుని ఆత్మహత్య చేసుకున్నారు. రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments