Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి, భార్యను పుట్టింటికి పంపించి యువతితో ఎంజాయ్ చేస్తూ?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (18:21 IST)
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రేమించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారు కొంతమంది బాగానే ఉన్నా మరికొంతమంది మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సంఘటనే కర్నూలులో జరిగింది. 
 
కర్నూలు జిల్లా జూపాడుకు క్రిష్ణ, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజకుమారికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. కర్నూలు నగరంలోనే కాపురం పెట్టాడు క్రిష్ణ. స్థానికంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో క్రిష్ణ అకౌంటెంట్‌గా చేరాడు. 
 
ప్రేమ పెళ్ళి కావడంతో వీరు అన్యోన్యంగా కలిసి ఉండేవారు. నెలరోజులు బాగానే సాగింది. కడపకు వెళదామని, అమ్మానాన్నలను చూసొద్దామని క్రిష్ణను కోరింది రాజకుమారి. అయితే క్రిష్ణ అందుకు ఒప్పుకునేవాడు కాదు. కానీ ఆ తర్వాత ఆమె అడక్కముందే పుట్టింటికి వెళ్లమంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఈ మార్పును గమనించింది రాజకుమారి. భార్యను రానురాను దూరం పెడుతూ వచ్చాడు. 
 
నేను కడపకు వెళ్ళొస్తాను. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది రాజకుమారి ఓ రోజు. సరేనన్నాడు క్రిష్ణ. నాలుగు రోజులు తరువాత వస్తానని చెప్పిన రాజకుమారి భర్తపై అనుమానంతో రెండు రోజుల్లోనే తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చి చూసిన కుమారి షాక్ తిన్నది. తన ఇంటిలోనే భర్త వేరొక యువతితో కలిసి ఉన్నాడు. భర్తను నిలదీసింది. ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇలా చేస్తావా అంటూ ప్రశ్నించింది.
 
ఆగ్రహంతో ఊగిపోయాడు క్రిష్ణ. ఆమెను బ్లేడ్ తీసుకుని అతి దారుణంగా ఒంటిపై గాయాలు పెట్టాడు. క్రిష్ణ నుంచి తప్పించుకున్న రాజకుమారి నేరుగా తండ్రికి ఫోన్ చేసింది. రాజకుమారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రిష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments