Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను ఆవహించిన పొగ మంచు... లారీనీ ఢీకొన్న వోల్వో బస్సు..!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (10:38 IST)
హైదరాబాద్‌ను పొగ మంచు ఆవహించింది. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాలలో శుక్రవారం వేకువజాము నుంచే పొగ మంచు ఏర్పడింది. దీంతో రోడ్లపై ముందు వెళ్లే వాహనాలు కనిపించని స్థితి ఏర్పడింది. పలు ప్రాంతాలలో వాహనాలు నత్తనడక నడిచాయి. 
 
ఈ స్థితిలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు కట్టంగూర్ వద్ద  హైదరాబాద్ వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. కాగా పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
 
పొగ మంచు కారణంగా పలు విమానాలు, రైళ్లు రాక పోకల్లో ఆలస్యం చోటు చేసుకుంది. విదేశాల నుంచి నగరానికి వచ్చిన రెండు విమానాలను చెన్నైకి తరలించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments