Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 14న లోక్ అదాలత్

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డిసెంబరు 14న జరిగే జాతీయ లోక్  ఆధాలత్  కు సంబంధించిన కేసుల పరిష్కారానికి డిసెంబరు 2 ,సోమవారం నుండి హైకోర్టులో ముందస్తు బెంచీలు ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్రటరీ యం. వి.రమణకుమారి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
 
హైకోర్టులో పెండింగులో ఉన్న మోటారు వాహన ప్రమాద సంబంధ అప్పీళ్ళు , సర్వీస్ రిట్స్, పెన్షన్ రిట్స్, రెవెన్యూ కేసులు , ల్యాండ్ ఎక్విజిషన్ అప్పీళ్ళు , చెక్ బౌన్స్ అప్పీళ్సు, కుటుంబ తగాదాలు, రాజీపడదగిన క్రిమినల్ అప్పీళ్ళు, ఎపిఎస్ఆర్టీసీకి సంబంధించిన అన్ని రిట్స్, మనీ అప్పీళ్ళు, బ్యాంక్, చిట్ ఫండ్  కేసులకు సంబంధించిన అప్పీళ్ళు మొదలైన కేసులు జాతీయ  లోక్ అదాలత్ లో పరిష్కరించబడతాయని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం  0863 - 2372604 ఫోన్ నెంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించవచ్చునని ఆమె  తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments