పౌరులకు మెరుగైన సేవలందిద్దాం: విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:54 IST)
విజ‌య‌వాడలో వివిధ రంగాల్లో సేవ‌లందిస్తున్న రోట‌రీ, ల‌య‌స్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌తో న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ శ‌నివారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాలయంలో స‌మావేశ‌మ‌య్యారు.

న‌గ‌రంలో  విద్య,  వైద్యం, పారిశుధ్యం, జీవనోపాధి రంగాల్లో మ‌రింతమందికి సేవ‌లందేలా న‌గ‌ర పాలక సంస్థతో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు రావాల‌ని రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌కు క‌మిష‌న‌ర్ సూచించారు. ఇప్ప‌టికే  రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ అధ్వ‌ర్యంలో న‌గ‌రంలో అనేక సేవలందిస్తున్నార‌ని పేర్కొంటూ వారిని క‌మిష‌న‌ర్ అభినందించారు.

ముఖ్యంగా ర‌క్త‌దానం, కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం,  ప్రతిభ గల విద్యార్థులకు ఉప‌కార వేత‌నాలు అందించ‌డం వంటి సేవలందిస్తున్నార‌ని తెలిపారు.

స‌మావేశంలో రోట‌రీ, ల‌య‌న్స్ ప్ర‌తినిధులు కెఎన్ఎస్ఆర్ ప్రసాద్, వి.కేశవరావు,  వి.వెంకటేశ్వరరావు, వై.పార్ధసారధి, ర‌వీంద్ర, దుర్గా, జోనికుమారి, శాంతి, శంకర గుప్త  త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments