తిరుపతి శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (08:06 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. నగర పరిధిలోని 45వ డివిజన్‌ శివజ్యోతినగర్ సమీపంలోకి ఆదివారం రాత్రి వచ్చిన చిరుతను చూసిన జనం భయంతో హడలిపోయారు. 
 
అడవిలోంచి కాలనీలోకి ప్రవేశించిన చిరుత ఇళ్లపైకి ఎక్కి తిరుగుతూ కనిపించింది. చిరుతను భయటపెట్టేందుకు కొందరు బాణసంచా కాల్చారు. మరికొందరు కర్రలు చేతపట్టుకుని తరిమారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. 
 
గత వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించిన విషయం తెల్సిందే. ఈ విషయం తిరుపతి అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ చిరుత పిల్లల కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఇపుడు ఏకంగా చిరుతపులి సంచారం చేయడం గమనార్హం. 
 
కాగా, ఇటీవలి కాలంలో తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా నడకదారిలో పలుమార్లు కనిపించిన పులులు భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో అవి అడవి నుంచి జనారణ్యంలోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments