సింగరికోనకు బైక్‌పై వెళుతున్న దంపతులపై చిరుత అటాక్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (09:41 IST)
ఇటీవలి కాలంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. జనావాస ప్రాంతాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన సింగరికోనకు బైక్‌పై వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడి నుంచి వారు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు నిన్న బైక్‌పై సింగరికోనకు బయలుదేరారు. మార్గమధ్యంలో పొంచి వున్న ఓ పులి వీరిపై ఒక్కసారిగా దాడి చేయడంతో కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి ఓ కారు రావడంతో బెదిరిన చిరుత అక్కడి నుంచి పరారైంది. 
 
గాయపడిన దంపతులను వెంటనే పుత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మధ్యాహ్నం నగరికి చెందిన మరో జంటపైనా పులి దాడికి యత్నించింది.  విషయం తెలిసి అప్రమత్తమైన పోలీసులు, అటవీశాఖ అధికారులు సింగరికోన మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments