Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్‌కి కా అంటే కీ రాదు... లక్ష్మీ పార్వతి సెటైర్లు

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై స్వర్గీయ ఎన్.టి.రామారావు సతీమణి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేగాకుండా నారా లోకేష్‌పై కూడా నిప్పులు చెరిగారు. నందమూరి కుటుంబాన్ని కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకునే హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు దూరంగా వున్నారన్నారు. 
 
అలాగే లోకేష్‌కి కా అంటే కీ రాదని విమర్శించారు. నెలకు రూ.10 లక్షల ఖర్చుతో ట్యూషన్ పెట్టించి తెలుగు భాష నేర్పినా కూడా లోకేష్ నేర్చుకోలేకపోతున్నాడన్నారు. అతనిని సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏపీలో ఎన్నికలెప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. 
 
ఏపీలో ఎన్నికలొస్తాయని చెప్పే అమరావతిలోని నీరు కొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీరుకొండలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ బాబు మాయమాటలు చెప్తున్నారని... ఆ మాటలను ప్రజలు ఏమాత్రం నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments