Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదర ప్రేమ.. తమ్ముడి ప్రేమ కోసం అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు..

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (14:54 IST)
సోదర ప్రేమ ఓ ప్రాణాన్ని బలిగొంది. తమ్ముడి ప్రేమను కాపాడేందుకు అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం పేరూలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమ్ముడి ప్రేమకు మధ్యవర్తిగా ఉన్నాడంటూ ప్రవీణ్‌పై రెండ్రోజుల క్రితం అమ్మాయి బంధువులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. 
 
వీరి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్‌పై పారిపోతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్‌ను వెంటనే కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యుల్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 
 
పేరూరుకు చెందిన అమ్మాయి, అబ్బాయి మే 31న ఊరు విడిచి వెళ్లిపోయారు. వీరికి ప్రవీణ్‌ సహకరించాడని అమ్మాయి కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. ఆగ్రహంతో అతనిపై దాడి చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని ప్రవీణ్ కుటుంబం ఆవేదన చెందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments