Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ విశ్లేషకుడు 'కుండబద్ధలు' సుబ్బారావు ఇకలేరు

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (16:26 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండబద్ధలు సుబ్బారావుగా గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాటా సుబ్బారావు ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ వచ్చిన ఆయనను ఆదివారం ఆస్పత్రిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు సంతాపం తెలిపారు. 
 
కాగా, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కుండబద్ధలు సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ పోలీసులు నోటీసులు కూడా పంపించారు. ఈ విచారణకు వెళ్లకుండానే ఆయన కన్నమూశారు.
 
కాటా సుబ్బారావు మృతితో ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. కాగా, ఈయన కుండబద్ధలు అనే యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తూ ప్రభుత్వ తప్పొప్పులను విశ్లేషిస్తూ గుర్తింపుపొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments