Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దెబ్బకు ఆర్ఎంవో మృతి.. వైరస్ నుంచి కోలుకున్న ఎమ్మెల్యే అంబటి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (11:49 IST)
కృష్ణా జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ యోగేంద్రబాబు (59) కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు 15 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను విజయవాడలోని కొవిడ్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆ.న... కోలుకుంటున్నట్టే కనిపించారు. కానీ, బుధవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. 'మీ అందరి ఆశీస్సుల వల్ల కోలుకున్నాను. కరోనా సోకడంతో 10 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను. అయితే ఓ వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments