Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసకు అన్నాచెల్లెళ్లు.. ప్రేమించుకున్నారు.. చివరికి పెట్రోల్ పోసుకుని?

వరుసకు అన్నాచెల్లెళ్లు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని బాంబు పేల్చారు. చివర

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (11:18 IST)
వరుసకు అన్నాచెల్లెళ్లు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని బాంబు పేల్చారు. చివరికి ఏం చేయాలో తోచక.. కలిసి బతకలేక, విడిపోలేక ఆ ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని శివపురంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. శివాపురానికి చెందిన సాయి(19), నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఎల్‌బీ తండకు చెందిన సునీత(18)తో ప్రేమలో పడ్డాడు. తమకు పెళ్లి చేయాలంటూ ఇద్దరూ పెద్దలపై ఒత్తిడి చేశారు. వీళ్లిద్దరికీ వరుస కుదరదని కుటుంబీకులు, బంధువులు తేల్చిచెప్పారు. అయితే ఇంటి నుంచి పారిపోయిన ఈ జంట.. తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ జంట స్వగ్రామానికి చేరుకోగానే పెద్దలంతా పంచాయతీ పెట్టారు. 
 
అయితే సునీతను చూడలేకుండా సాయి వుండలేకపోయాడు. సునీత కూడా సాయికి దూరంగా వుండలేకపోయింది. దీంతో ఈ జంట పెనుగంచిప్రోలులోని సుబాబుల్ తోటలోకి వెళ్లి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఈ జంట పరిస్థితి విషమంగా వుందని వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments