Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్ రాజు .. నేడు అధికారిక ప్రకటన

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఈ పదవి కోసం ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పైగా, ఈ పదవికి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టడం లేదని ప్రకటించింది. దీంతో మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రొటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం.. శాసనమండలి కొత్త ఛైర్మన్‌ను అధికారికంగా ప్రటించనున్నారు. ఈ పోస్టులో ఇప్పటివరకు టీడీపీ నేత కొనసాగిన విషయం తెల్సిందే. ఇకపోతే, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో స్పష్టత రావాల్సివుంది. 
 
మోషన్ రాజు కౌన్సిలర్ పదవి నుంచి శాసనమండలి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా పదవీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మోషేన్ రాజు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో గత 1965లో జన్మించారు. బీఏ వరకు విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1987లో నాలుగు సార్లు కౌన్సిలర్‌గా ఉన్నారు. 
 
గత 2009లో కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం జగన్ హాజరుకావడంతో ఒక్కసారిగా ఆయనకు వైకాపాలో ఉన్న ప్రాధాన్యత వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నా.. పోలీసులకు బాగా సహకరించా : నటి కస్తూరి

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు గౌరవ డాక్టరేట్ తో సత్కారం

మహారాష్ట్రలో సాంగ్ షూట్ లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments