Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదాపై హోస్ట‌న్‌లో శివాలెత్తిన ఆంధ్రప్రదేశ్ స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల

హోస్ట‌న్: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయ‌వ‌ల‌సిన బాధ్య‌త బిజెపి ప్ర‌భుత్వంపై ఉంద‌ని డాక్ట‌ర్ కోడెల ధ్వ‌జ‌మెత్తారు. ప్రత్యేక హోదా ద్వారా మాత్ర‌మే న‌వ్యాంధ్ర‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని స‌భాప‌తి అభిప్రాయపడ్డారు. నాడు కేంద్రంలో అధికార

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (20:08 IST)
హోస్ట‌న్: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయ‌వ‌ల‌సిన బాధ్య‌త బిజెపి ప్ర‌భుత్వంపై ఉంద‌ని డాక్ట‌ర్ కోడెల ధ్వ‌జ‌మెత్తారు. ప్రత్యేక హోదా ద్వారా మాత్ర‌మే న‌వ్యాంధ్ర‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని స‌భాప‌తి అభిప్రాయపడ్డారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న‌కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత అవ‌మాన‌క‌ర రీతిలో రాష్ట్రాన్ని ముక్క‌లు చేసింద‌ని, ఇపుడు బీజేపీ ఆశ‌ల్ని అడియాశలు చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. జన్మభూమి పథకం కింద ప్రవాస ఆంధ్రులు రాష్ట్ర అభివృద్ధి లో పాలుపంచుకునేలా ప్రోత్స‌హించేందుకు అమెరికాలోని హౌస్టన్ నగరంలో సోమ‌వారం ఎన్.ఆర్.ఐ తెలుగు సంఘాలు నిర్వ‌హించిన  ప్ర‌త్యేక ముఖాముఖి కార్యక్రమంలో  స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొన్నారు.
 
నిజానికి కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా సొంత కాళ్లపై నిలిచే సత్తా తెలుగువారికి ఉందని నిరూపించుకుందామని, అందుకు ప్ర‌వాస ఆంధ్రులు త‌మవంతుగా ముంద‌డుగు వేయాల‌ని పిలుపు నిచ్చారు. విదేశాల్లో స్థిర పడిన ప్రవాసాంధ్రులు నవ్యంధ్ర నిర్యాణంలో చురుకైన పాత్ర పోషించాలని, తమకు జన్మనిచ్చిన గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం సమర్ధంగా సేవ‌లు అందిస్తున్నార‌ని, సొంత నిధుల్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారని కొనియాడారు.
 
అమెరికాలో ఆంధ్రరాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, తానా మాజీ అధ్యక్షురాలు ముత్యాల పద్మశ్రీ తదితరులు ప్రసంగించారు. మ‌రోవైపు అక్క‌డి సాయిబాబా గుడిలో టిఎజిహెచ్‌ ఆధ్వర్యంలొ జరిగిన బోనాలు ఉత్స‌వాల‌లో డాక్టర్ కోడెల పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయినా తెలుగువారందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments