Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా..? ఆ మంత్రి మాటలకు అర్థం ఏంటి?

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (07:37 IST)
తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ పాత్ర చాలా కీలకమైనది. అన్ని పార్టీలను, అన్ని వర్గాలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలోనూ, వారిని సమన్వయపరచడంలోనూ ఆయన చేసిన ప్రయత్నాలు చాలా కీలకమయ్యాయి. అలాంటి వ్యక్తి తెలంగాణ సిద్ధించిన తరువాత నేరుగా రాజకీయాల్లో పాల్గొన లేదు. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుస్తోంది. ఎప్పుడు ? ఎలా ? ఆ మంత్రి మాటలకు అర్థం ఏంటి? 
 
హైదరాబాద్‌, చిలకలగూడలోని కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి పద్మారావు కోదండరామ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ మరుక్షణమే రాజకీయాల్లోకి రావాలని కోదండరామ్‌ను కోరామని ఆయన పేర్కొన్నాయి. 
 
అయితే తెలంగాణ సమాజం బాగుపడ్డ తర్వాతే తాను రాజకీయాల్లోకి వస్తానని కోదండరామ్ చెప్పారని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వం కోదండరామ్ ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తోందని పద్మారావు వ్యాఖ్యానించారు. కోదండరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందన్నట్లు చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments