Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండీ ఇచ్చి చొక్కా కొట్టేసినట్లు, విద్యా కానుక ఎర వేసి పిల్లల బడులు కొట్టేశాడు.

Webdunia
బుధవారం, 6 జులై 2022 (16:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోమారు విమర్శలు గుప్పించారు. పాఠశాలల విలీనం పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలను మూసివేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బడులు ప్రారంభంకావడంతో తమ ప్రాంతంలోని స్కూల్ మూసివేసినట్టు తెలియగానే వారు మండిపడుతూ ఆందోళనకు దిగుతున్నారు. 
 
దీనిపై అచ్చెన్నాయుడు ట్వీట్ల వర్షం కురిపించారు. "జగన్ రెడ్డి పంట బీమా బటన్ నొక్కగానే రైతులు రోడ్డున పడ్డారు.. విద్యా కానుక బటన్ నొక్కగానే పసి పిల్లలు రోడ్డున పడ్డారు.. ఇస్తున్నాను అని ఏదన్నా బటన్ నొక్కాడు అంటే దాని వెనుక ప్రజలకు తెలియకుండా లాక్కునే బటన్లు ముందే నొక్కేసాడు అని అర్థం. 
 
3,4,5 తరగతులను ఉన్నత విద్య పాఠశాలల విలీనం పేరుతో, రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ సంఖ్యను తగ్గించి వేస్తున్నారు. తద్వారా టీచర్ల నోటిఫికేషన్లు కూడా తగ్గించబడతాయి. ముఖ్యంగా పాఠశాలల భూములపై ఈ గద్దలు కన్నేశారు. విలీనం పేరుతో పసి పిల్లలను కిలోమీటర్ల మేర నడిపిస్తూ కష్ట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? గుండీ ఇచ్చి చొక్కా కొట్టేసినట్లు, విద్యా కానుక ఎర వేసి పిల్లల బడులు కొట్టేశాడు అంటూ విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments