Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో మరిది రొమాన్స్... పిల్లలు అడ్డుగా ఉన్నారనీ...

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది.

Webdunia
బుధవారం, 26 జులై 2017 (08:49 IST)
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది. వదినతో తాను అనుకున్నపుడు ఏకాంతంగా గడిపేందుకు చిన్నారుల వల్ల వీలుపడక పోవడంతో ఇద్దరు చిన్నారుల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి వారిద్దరినీ కాలువలో తోసేసి చంపేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకరపు చిన్నారావు, మంగ దంపతుల కుమారులైన ప్రశాంత్‌(10), విక్కీ(8) ఆదివారం ఉదయం పాలు తేవడానికి వెళ్లారు. అయితే, ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన వరసకు బాబాయ్‌ అయిన కైకరపు రవిశేఖర్‌ ఆదివారం ఉదయం మోటార్‌ సైకిల్‌ పై ఎక్కించుకుని పోలవరం వైపునకు తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించగా, అసలు విషయం తెలిసింది. 
 
చిన్నారుల తల్లి మంగతో తనకు వివాహేతర సంబంధం ఉందనీ, ఆమెతో తాను అనుకున్నప్పుడల్లా ఏకాంతంగా గడిపేందుకు చిన్నారులు అడ్డుగా ఉండటంతో వారిని అడ్డుతొలగించుకునే క్రమంలో నీటి కాలువలో తోసేసి హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments