Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి జరిపే స్థోమత లేదు.. మెరుగు పెట్టే రసాయనం తాగి ముగ్గురు ఆత్మహత్య

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (09:54 IST)
పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం.. పెళ్లి చేసేదెలా? అని కుంగిపోయింది. తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఈ ఘటన ఖమ్మంలో విషాదాన్ని నింపింది.
 
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో ఓ కుటుంబంలో నివాసం ఉంటుంది.. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబంలో కుమార్తెకు వివాహం నిశ్చయం అయ్యింది. జనవరి 11న వివాహం నిర్వహించాల్సి ఉంది. తండ్రి ప్రకాష్ బంగారం షాపులో పని చేస్తుండగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. 
 
కట్నం లేకుండా వివాహానికి సిద్ధం అయ్యారు.. అక్కడి వరకు బాగానే ఉన్నా.. పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు పుట్టని పరిస్థితి నెలకొంది.. వివాహం దగ్గర పడటం, డబ్బులు లేకపోవడంతో కలతచెందారు. 
 
బుధవారం రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి.. తల్లి గోవిందమ్మ (49), కూతుళ్లు రాధిక(29), రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చే సరికి ఇంట్లో అంతా మృతిచెంది ఉండడంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments