Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా పాలకులంతా వెళ్లిపోయారు.. ఇక హైదరాబాద్ మాదే : కేంద్రానికి కేసీఆర్ లేఖ

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభమైందని, హైదరాబాద్‌లోని ఉద్యోగులంతా అక్కడికి తరలి వెళ్లారని, అందువల్ల ఇక హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అని అనొద్దంటూ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ము

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభమైందని, హైదరాబాద్‌లోని ఉద్యోగులంతా అక్కడికి తరలి వెళ్లారని, అందువల్ల ఇక హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అని అనొద్దంటూ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాయనున్నారు. 
 
పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా చూపించాల్సిన అవసరం లేదని, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా, తెలంగాణకు మాత్రమే హైదరాబాద్‌ను రాజధానిగా పేర్కొంటూ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం. ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది.
 
కాగా, చట్టంలోనే 'ఉమ్మడి రాజధాని' అన్న పదాన్ని పేర్కొన్నందున, కేవలం హోం శాఖ నిర్ణయం మాత్రమే సరిపోదని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చట్ట సవరణ చేయాల్సి వుందని, దానికి రెండు రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరని, ఏపీ ప్రభుత్వం అంగీకరించకుండా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments